అలజంగిలో అధ్వాన్నంగా మురుగునీటి కాలువలు
VZM: బొబ్బిలి మండలం అలజంగిలో మురుగునీటి కాలువలు అధ్వాన్నంగా ఉన్నాయి. పెంటవీధి కాలువలలో పేరుకుపోయిన పూడికలను తీయకపోవడంతో మురుగునీరు సక్రమంగా ప్రవహించకపోవడంతో దుర్వాసన, దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. కాలువలలో పూడికలు తీసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.