'రహదారి పనులు వేగంగా పూర్తి చేయండి'

WNP: పానగల్ మండలం కేతేపల్లి గ్రామంలో రహదారి పనులు వేగంగా పూర్తి చేయాలని గ్రామస్తులు, వాహనదారులు కోరుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రహదారి మార్గంలో వర్షపు నీరు చేరి ప్రయాణించడం ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.