ఉత్తమ పంచాయతీ అధికారి అవార్డు అందుకున్న వెంకటేశ్వరరావు

BDK: కొత్తగూడెంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆధ్వర్యంలో ఉత్తమ పంచాయతీ అధికారి అవార్డు పినపాక ఎంపీవో వెంకటేశ్వరరావుకి అందజేశారు. గ్రామాభివృద్ధి, పల్లెప్రగతి, ప్రజాసేవలో విశిష్ట కృషి చేసినందుకు ఈ అవార్డు లభించిందని తెలిపారు.