ముంపులో 1,098 ఇళ్లు: కలెక్టర్

ముంపులో 1,098 ఇళ్లు: కలెక్టర్

కోనసీమ: గోదావరి వరదల వల్ల ముంపు బారిన పడిన గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. జిల్లాలో 1,098 ఇళ్లు మంపుబారిన పడ్డాయన్నారు. 1,291 కుటుంబాల్లో 4,257 మంది వరద ప్రభావానికి గురైనట్లు ఆయన తెలిపారు. జిల్లాలో వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టిందని, ఒకటి రెండు రోజుల్లో గోదావరి సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందన్నారు.