హైదరాబాద్‌లో వైరల్ వ్యాధుల కలకలం
HYD: చలికాలం మొదలవడంతో నగరంలో వైరల్ వ్యాధులు పెరిగుతున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో ఆసుపత్రుల్లో రోజుకు 60 నుంచి 70 మంది చేరుతున్నారు. దీంతో వ్యాధిగ్రస్తులు విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడొదని వైద్యులు వెల్లడించారు. ఇది 3 నుంచి 4 రోజుల్లో తగ్గుతాయని.. వేడి నీళ్లు తాగడం, ఆవిరి పట్టడం మంచిదని, ఇలా చేస్తే ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు.