రూ.15 లక్షల CMRF చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ATP: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కును తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆదివారం పంపిణీ చేశారు. దర్మాపురం గ్రామానికి చెందిన నగోతు తేజస్విని ప్రమాదానికి గురికాగా రూ.15 లక్షల సీఎం సహాయ నిధి మంజూరైంది. ఆ మొత్తాన్ని బాధితురాలి భర్త అనీల్‌కు ఎమ్మెల్యే తన స్వగృహంలో అందజేశారు. ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని తెలిపారు.