వీధుల్ని శుభ్రం చేసిన మంత్రి కొలుసు

AP: మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు జిల్లాలో పర్యటించారు. ఆగిరిపల్లి మండలం శోభనాపురంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో మంత్రి పారిశుద్ధ్య కార్మికుడిలా మారి.. చీపురు పట్టుకుని వీధుల్ని శుభ్రం చేశారు. ఆయనతో పాటు నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, టీడీపీ కార్యకర్తలు సైతం రోడ్లను ఊడ్చారు.