VIDEO: సంస్థానాల విలీనంలో పటేల్ కృషి ఎంతో ఉంది: MP
SRPT: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఇవాళ సూర్యాపేట పట్టణ కేంద్రంలో నిర్వహించిన యూనిటీ మార్చ్‌లో ఎంపీ కే శ్రీదేవ్‌సిన్హ్ ఝలా పాల్గొన్నారు. 560కి పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో పటేల్ కృషి ఎంతో ఉందన్నారు. గత ప్రభుత్వాలు ఆయనను గుర్తించలేదని విమర్శించారు. ఆయన గురించి యావత్ దేశానికి తెలియాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు.