'బీసీల డిమాండ్లు పరిష్కరించాలి'

'బీసీల డిమాండ్లు పరిష్కరించాలి'

MNCL: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మంచిర్యాల గాంధీ పార్కులో 24 గంటల నిరవధిక దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. తక్షనమే ప్రభుత్వం బీసీ ఆక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.