కుక్క పిల్లపై వానరం 'తల్లి' ప్రేమ

కుక్క పిల్లపై వానరం 'తల్లి' ప్రేమ

SDPT: వర్గల్(M) నాచారంలో హృదయాలను కదిలించే ఘటన చోటుచేసుకుంది. మనుషుల్లో మానవత్వం తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఓ వానరం చూపిన అపూర్వమైన ప్రేమ అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. ఎండలో అలమటిస్తున్న ఓ చిన్న కుక్క పిల్లను చూసిన వానరం దగ్గరికి తీసుకుంది. అంతేకాదు చెట్టుపైకి తీసుకెళ్లి దగ్గరికి హత్తుకుని నీడనిచ్చింది. ప్రేమకు జాతి, రూపం, భాష అనే తేడాలు ఉండవని ఈ సంఘటన నిరూపించింది.