అల్లూరి ఆశయాలను కొనసాగిస్తాం: శ్రీరాములు

అల్లూరి ఆశయాలను కొనసాగిస్తాం: శ్రీరాములు

సత్యసాయి: పెనుకొండలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు శ్రీరాములు, రిటైర్డ్ టీచర్ షమీవుల్లా మాట్లాడుతూ... అల్లూరి సీతారామరాజు సేవలు కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు.