సభ్యత్వ నమోదులో రాజోలుకు నాలుగో స్థానం: ఎమ్మెల్యే దేవ
కోనసీమ: జనసేన పార్టీ సభ్యత్వ (ఉధ్యమం) నమోదులో రాజోలు నియోజకవర్గం రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచినట్లు ఎమ్మెల్యే వర ప్రసాద్ చెప్పారు. రాజోలు నియోజకవర్గంలో 35వేలకు పైగా సభ్యత్వాలను నమోదు చేసినట్లు తెలిపారు. గతంలో నియోజకవర్గంలో 25 వేల వరకు సభ్యత్వాలు ఉండగా, మరో పదివేలు అదనంగా నమోదు చేసిన ఘనత నియోజకవర్గ సాధక్ లకు దక్కిందని అభినందించారు.