కేబుల్ వైర్లను అలాగే వదిలేశారు..!

HYD: ప్రభుత్వ ఆదేశాలపై రెండు రోజుల క్రితం పద్మకాలనీ, శంకరమఠం పరిధిలో కేబుల్ వైర్‌లను అధికారులు కట్ చేసి రోడ్డుపై అలాగే వదిలివేశారని స్థానికులు తెలిపారు. దీంతో వాహనదారులు గమనించక ప్రమాదాల బారిన పడుతున్నారని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఇక్కడే కాకుండా నగరంలోని పలుచోట్ల ఇలానే కేబుల్ వైర్లు అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి.