VIDEO:ప్లెక్సీ వివాదం.. వీడియో వైరల్..!
E.G: సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో టీడీపీ, జనసేన నాయకుల మధ్య విభేదాలు తలెత్తాయి. డిప్యూటీ సీఎం ఫొటో ప్లెక్సీలో లేకపోవడంతో జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసి ఫ్లెక్సీని తొలగించే ప్రయత్నం చేశారు. టీడీపీ నేతలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగి ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ప్రస్తుతం ఈ వీడియోలు SMలో వైరల్ అవుతున్నాయి.