నేడు డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం
MHBD: తొర్రూరు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ లయన్స్ క్లబ్ భవనంలో వాహనాలు నడిపే డ్రైవర్లలందరికీ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఎస్సై గొల్లమూడి ఉపేందర్ తెలిపారు. కంటి పరీక్షలు చేయించుకొని వైద్యుల సూచనల మేరకు ఉచితంగా మందులు, కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. కావున ప్రతి డ్రైవర్ ఈ ఉచిత కంటి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.