పల్లకి మోసిన డీఎస్పీ
SRPT: గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై నరేష్ తమ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, డీఎస్పీ స్వయంగా పల్లకి మోసి భక్తిని చాటుకున్నారు. పోలీసులు భక్తులతో పాటు మమేకం కావడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.