అద్దంకివారిలంకలో పడకేసిన పారిశుద్ధ్యం

కోనసీమ: కపిలేశ్వరంపురం మండలంలోని అద్దంకివారిలంకలో పారిశుద్ధ్యం పడకేసింది. గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో చెత్తాచెదారం రోజురోజుకు పేరుకుపోతోందని గ్రామస్థులు తెలిపారు. దీంతో దుర్వాసన వస్తోందని.. గత మూడు రోజులుగా వర్షాలు కురవడంతో చెత్త మరింత పెరిగిందన్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.