VIDEO: ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు

JGL: మెట్‌పల్లి మండలం మేడిపల్లి శివారులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ట్రాక్టర్‌ను ఓవర్ టేక్ చేసే క్రమంలో ఢీకొట్టింది. ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడగా, బస్సు ముందు భాగం ధ్వంసం అయింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.