విద్యార్థులతో సెల్ఫీలు తీసుకున్న ఎమ్మెల్యేలు
ATP: పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) సమావేశాల్లో ఎమ్మెల్యేలు బండారు శ్రావణి, పల్లె సింధూరారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను ఉత్సాహపరుస్తూ వారితో సెల్ఫీలు తీసుకున్నారు. చదువుతోనే ఉత్తమ భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులకు సూచించారు. తమ ప్రభుత్వం విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యేలు తెలిపారు.