రైతు అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయం: MLA

రైతు అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయం: MLA

SKLM: రైతు అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయంగా పని చేస్తుందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పలాస మండలం రెంటి కోట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే శిరీష ఇవాళ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని, దళారుల బారిన పడి మోసపోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు ఉన్నారు.