నూతన RDOను కలిసిన ఎమ్మెల్యే
KRNL: ఆత్మకూరు ఆర్డీవోగా వెంకట శివ నూతనంగా బాధ్యతలు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆయనను పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్‌ను జారీ చేయడం వంటి విధులను అమలు చేస్తూ ప్రజల మన్నలను పొందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.