ట్రాన్స్‌ఫార్మర్ పగలగొట్టి రాగి తీగలు చోరీ

CTR: మండలంలోని గూడూరుపల్లి గ్రామ సమీపంలో రైతు నరసింహులుకు చెందిన వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు పగలగొట్టారు. అనంతరం దాదాపు 25కిలోల రాగి తీగలు ఎత్తుకెళ్లారు. కాగా, ఘటనపై విద్యుత్ శాఖ ఏఈ ధనుంజయరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.