విద్యుతాఘాతంతో 4 పాడి గేదెలు మృతి

విద్యుతాఘాతంతో 4 పాడి గేదెలు మృతి

JGL: బుగ్గారం మండలం చందయ్యపల్లెకు చెందిన 4 పాడి గేదెలు విద్యుతాఘాతంతో మృతి చెందాయి. మంగళవారం ఉదయం గేదెలు మేతకోసం చిన్నాపూర్ గ్రామ శివారులోకి వెళ్లగా విద్యుత్ తీగలు తెగి కింద పడిపోవడంతో తీగలపై వెళ్తున్న చందయ్యపల్లెకు చెందిన బియ్యాల చంద్రయ్య, గాదే లచ్చయ్య, చల్ల లచ్చయ్య, చల్ల భూమక్కలకు సంబంధించిన 4 గేదెలు మృత్యువాత పడ్డాయని స్థానికులు తెలిపారు.