INSPIRATION: యలమంచిలి వెంకటప్పయ్య

INSPIRATION: యలమంచిలి వెంకటప్పయ్య

నాటి సమాజంలోని మత మౌఢ్యంపై పోరాడి హేతువాద బాటలో నడిచిన ధీశాలి యలమంచిలి వెంకటప్పయ్య. స్వాత్రంత్ర్య సమరయోధుడిగా దేశం కోసం పోరాడుతూనే తన రచనలతో సమాజంలోని కులవివక్ష, మూఢనమ్మకాలను ఎండగట్టిన సంఘసంస్కర్త. తన రచనలతో అణగారిన వర్గాలకు గొంతుకగా, సామాజిక సమానత్వమే లక్ష్యంగా జీవితాంతం కృషిచేశారు. నిరాడంబరత, నైతిక విలువలకు నిలువెత్తు సాక్ష్యంగా తన జీవితాన్ని గడిపారు.