రాజిరెడ్డికి నివాళులు అర్పించిన నగర మాజీ మేయర్

రాజిరెడ్డికి నివాళులు అర్పించిన నగర మాజీ మేయర్

మేడ్చల్: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి మృతికి మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు బండ చంద్రారెడ్డి సంతాపం తెలిపారు. హబ్సిగూడలోని రాజిరెడ్డి నివాసంలో రాజిరెడ్డి పార్థీవ దేహం వద్ద పూలమాలతో శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన సోదరుడు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని, కుటుంబ సభ్యులను పరామర్శించారు.