అభ్యర్థులు తమ వెంట లాయర్లను తీసుకెళ్లాలి: మమతా
కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ తొత్తుగా వ్యవహరిస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. బీజేపీ , ఎన్నికల సంఘంపై తమకు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల సందర్భంగా నామినేషన్ వేసేందుకు వెళ్లే టీఎంసీ అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆ సమయంలో తమ వెంట లాయర్లకు తీసుకెళ్లాలని, ప్రతి పత్రాన్ని జాగ్రత్తగా తనిఖీ చేసుకోవాలని కోరారు.