శబరిమల, పుట్టపర్తికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

శబరిమల, పుట్టపర్తికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

VSP: శబరిమలై భక్తుల కోసం విశాఖ నుంచి ప్రత్యేక బస్సు ప్యాకేజీలు నడుపుతున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి. అప్పలనాయుడు ఆదివారం ప్రకటించారు. పంచరామాలకు లభించిన స్పందన మాదిరిగానే శబరిమలైకి కూడా మంచి స్పందన ఉంటుందని ఆయన తెలిపారు. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు డిమాండ్‌ను బట్టి పుట్టపర్తికి కూడా బస్సులు నడుపుతామన్నారు.