మార్చి నాటికి భారత్-అమెరికా ట్రేడ్‌డీల్: సీఈఏ
మార్చి నాటికి భారత్-అమెరికా ట్రేడ్‌డీల్ కుదురుతుందని ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు. ఇరుదేశాల మధ్య ఇప్పటికే చాలా వాణిజ్య సమస్యలు పరిష్కారమయ్యాయని చెప్పారు. 2027 ఆర్థిక సంవత్సరం ఫలితాలపై అంచనాలు బలంగా ఉన్నాయన్నారు. మరోవైపు తమకు భారత్ నుంచి అత్యుత్తమ ట్రేడ్ ఆఫర్స్ అందాయని అమెరికా వాణిజ్య ప్రతినిధి నిన్న చెప్పారు.