VIDEO: పద్మశ్రీ ఆదినారాయణ మృతి వైద్యరంగానికి తీరని లోటు
Vsp: లక్షలాది మంది పోలియో బాధితులకు ఉచిత శస్త్రచికిత్సల ద్వారా నడకను ప్రసాదించిన అపర ధన్వంతరి, పద్మశ్రీ డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ రావు మృతి వైద్యరంగానికి తీరని లోటని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం విశాఖలో ఆయన భౌతికకాయానికి నివాళులర్పించిన బొలిశెట్టి, డాక్టర్ ఆదినారాయణ చేసిన సేవలను కొనియాడారు.