గొల్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

గొల్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

అన్నమయ్య: బి.కొత్తకోట(M) గోళ్ళపల్లి వద్ద ఇన్నోవా కారు బోల్తపడి శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కాగా, ఆరుగురు త్రీవంగా గాయపడ్డారు. మృతులు మదనపల్లికి చెందిన శ్రీనివాసులు, సాయిగా గుర్తించారు. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన మదనపల్లి జిల్లా ప్రభుత్వసుపత్రికి తరలించారు.