ఈ నెల 9న రాజంపేటలో సమావేశం
అన్నమయ్య: రాజంపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 9న నిర్వహించనున్నట్లు MPDO వరప్రసాద్ తెలిపారు. ఈ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా,పారిశుద్ధ్యంపై సమీక్ష ఉంటుందని అలాగే వైద్య ఆరోగ్యశాఖ, పశువైద్య శాఖ, ఉపాధి హామీ, గృహ నిర్మాణం, విద్యుత్ శాఖ, విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వ్యవసాయ శాఖ, ఇందిరా క్రాంతి పథకం, రెవెన్యూ ప్రజా పంపిణీ వ్యవస్థపై సమీక్ష ఉంటుందని ఆయన తెలిపారు.