వర్షాలకు అధ్వానంగా మారిన రోడ్లు
NGKL: ఇటీవల కురుస్తున్న చిన్నపాటి ముసురు వర్షాలకు పదర మండల కేంద్రంలో అంతర్గత రోడ్లు చిత్తడిగా, అధ్వానంగా తయారై బురదమయంగా మారాయి. దీంతో అటువైపుగా వెళ్తున్న పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా వాహనదారులు అదుపుతప్పి కింద పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్లు బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.