ఇల్లందులో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

ఇల్లందులో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

BDK: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇల్లందు పట్టణంలో బీజేపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు సుచిత్ర పాసి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్నారులతో కలిసి త్రివర్ణ పతాకాన్ని చేత పట్టుకొని పట్టణంలోని వీధుల గుండా తిరుగుతూ భారతీయ మువ్వన్నెల జెండా గొప్పతనం అందరికీ తెలిసేలా దేశభక్తిని చాటుకున్నారు.