‘గ్రామాల అభివృద్ధి పన్నుల వసూళ్లపైనే ఆధారపడి ఉంది’
PLD: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన పన్నుల వసూళ్లపైనే ఆధారపడి ఉంటుందని ఎంపీడీవో ఉమాదేవి అన్నారు. ఈపూరు మండలంలోని 18 పంచాయతీల్లో మొత్తం రూ.77.47 లక్షల ఇంటి పన్ను వసూలు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.48.68 లక్షలు మాత్రమే వసూలయ్యాయని ఆమె తెలిపారు. రూ.28.82 లక్షల బకాయిలు ఉన్నాయని, వీటిని సకాలంలో చెల్లించాలని కోరారు.