వైభవంగా సుబ్రహ్మణ్యం స్వామి కళ్యాణం

KDP: సిద్దవటం మండలంలోని పెద్దపల్లి పంచాయతీ కనుములోపల్లి గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యం స్వామి దేవస్థానంలో ఆదివారం వేదపండితులు సూర్యదేవ విగ్రహ ఆవిష్కరించారు. అనంతరం సుబ్రహ్మణ్యం స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని, స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.