VIRAL: చెల్లెలి సంతోషం కోసం రూ.21 కోట్ల కట్నం

తమ చెల్లికి పెళ్లి తర్వాత ఎలాంటి కష్టం రాకూడదనే ఉద్దేశంతో పెద్ద మొత్తంలో కట్నం ఇచ్చి వివాహం జరిపించారు. రాజస్థాన్‌కు చెందిన సోదరులు ఏకంగా రూ.21 కోట్ల ఆస్తిని కట్నంగా ఇచ్చారు. కేజీ బంగారం, 15 కేజీల వెండి, రూ.1.51 కోట్ల నగదు, 131 ఎకరాల భూమితో పాటు మరికొన్ని ఆస్తులతో కలిపి రూ.21 కోట్ల 11 వేలు ఆమెకు అందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో Xలో వైరల్‌గా మారింది.