టీడీపీ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు
VZM: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను శనివారం టీడీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సమాజం కోసం చేసిన మంచి పనులను గుర్తు చేశారు. అలాగే, పూలేను స్ఫూర్తిగా తీసుకుని అందరూ ముందుకు సాగాలని ఆమె కోరారు.