పోలీస్ అధికారుల నెలవారి నేర సమీక్ష సమావేశం
SRPT: పోలీస్ అధికారులు విధి నిర్వహణను అలసత్వం వహిస్తే సహించేది లేదని జిల్లా ఎస్పీ నర్సింహ అన్నారు. ఇవాళ ఎస్పీ కార్యాలయంలో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ వారిగా నమోదైన కేసులు, కేసు విచారణ గురించి అధికారులను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించార. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ఉన్నారు.