ఆరెంజ్ జోన్ లోకి పలమనేరు
CTR: పలమనేరులో ఆదివారం సూర్యుడు ప్రతాపం చూపించాడు. సుమారు 40.9 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరడంతో అధికారులు ఆరెంజ్ జోన్‌గా ప్రకటించారు. గంగవరం, పెద్ద పంజాణిలలో 39.6గా నమోదైంది. పూర్ మెన్ ఊటీగా పేరొందిన పలమనేరులో ఎప్పుడూ చల్లటి వాతావరణం ఉంటుంది. గత కొన్నేళ్లుగా వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు.