ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి యూనిట్లు మంజూరు
KMM: దళిత యువత ఆర్థికాభివృద్ధి కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాయితీపై ఉపాధి యూనిట్లు మంజూరు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ నర్సింహ్మ సోమవారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 8వ తేదీ లోపు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని కోరారు. మున్సిపాలిటీ పరిధిలోని అర్హులు ఈవీ వాహనాలు, పాడి గేదెల యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.