24 మంది సర్పంచ్ అభ్యర్థుల పేర్లు నమోదు
RR: కేశంపేట మండలంలో సర్పంచ్ నామినేషన్లు వేగం పుంజుకున్నాయి. మండల పరిధిలోని 29 గ్రామ పంచాయతీలకు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో గురువారం మొత్తం 24 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ చురుకుగా సాగుతుండగా.. అభ్యర్థులు, కార్యకర్తలు, ప్రజలతో గ్రామాలన్నీ సందడిగా మారాయి.