VIDEO: విద్యార్థులను వేధించిన కోచింగ్ సెంటర్ డైరెక్టర్
విజయనగరంలోని వినెక్స్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ సారిపల్లి శ్రీనివాస్ తమను లైంగికంగా వేధించారని సుమారు 20 మంది విద్యార్థినులు బుధవారం 2-టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై గురువారం దిశ పీఎస్ సీఐ నరసింహమూర్తి మాట్లాడుతూ.. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం పరారిలో ఉన్న శ్రీనివాస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.