నేడు ఉచిత వైద్య శిబిరం
JN: బచ్చన్నపేట మండలంలోని మన్సన్ పల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సర్పంచ్ గీస సందీప్ తెలిపారు. మెడిసిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిబిరంలో అన్ని రకాల శస్త్ర చికిత్సలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.