ఉగ్రలింకుల కేసులో ఐదుగురి కస్టడీకి అనుమతి

ఉగ్రలింకుల కేసులో ఐదుగురి కస్టడీకి అనుమతి

AP: విజయవాడ ఉగ్రలింకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురిని 5 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ సీజేఎం కోర్టు అనుమతినిచ్చింది. వారిలో ఏ1 రెహ్మతుల్లా, ఏ2 డానిష్, ఏ3 సోహైల్ బేగ్, ఏ5 సయిదా బేగం, ఏ11 అబ్దుల్ ఉన్నారు. ఉగ్రవాద కోణంలో లోతైన విచారణ జరిపేందుకు పోలీసులు వీరిని తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు.