గుంటూరులో ఉపాధ్యాయులకు ప్రతిభా పురస్కారాలు
GNTR: ఉపాధ్యాయులకు ఈ నెల 5న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు శుక్రవారం మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు తెలిపారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా 54 మంది ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేయనున్నట్లు ఆయన వివరించారు.