VIDEO: హోలీ వేడుకల్లో.. డాన్స్ చేసిన ఎమ్మెల్యే..!
ADB: ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. బ్యాండ్ మేళాల మధ్య కార్యకర్తలతో కలిసి డాన్స్ వేశారు. అభిమానులు, పార్టీ నాయకులు ఎమ్మెల్యేను తమ భుజాలపై ఎత్తుకుని జైత్రయాత్రలా ఊరేగించడంతో సందడి అంబరాన్నంటింది. ఈలలు, కేకలతో కార్యాలయం ప్రాంగణమంతా హోరెత్తింది.