పిల్లలను కడతేర్చి.. తండ్రి సూసైడ్

పిల్లలను కడతేర్చి.. తండ్రి సూసైడ్

TG: కన్నబిడ్డలను కడతేర్చి.. తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కపూర్‌లో చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలకు ఉరివేసి చంపేసి, తండ్రి సూసైడ్ చేసుకున్నాడు. మృతులు సుభాష్(42).. పిల్లలు మారిన్(13), ఆరాధ్య(10)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని మనస్తాపంతో సుభాష్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు చెప్పారు.