కాజీపేటలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

కాజీపేటలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

హన్మకొండ: కాజీపేట మండలంలో వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు కె. ఆర్. నాగరాజ్ ఆదేశాల మేరకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని కేక్ కటింగ్ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని మడికొండ చౌరస్తాలో ఈ వేడుకలు జరిపారు.