హోం మంత్రికి దళిత సంఘాల వినతి

SKLM: జిల్లాలోని అన్ని గురుకులాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని దళిత సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ దుర్గా శ్రీ గణేష్ హోంమంత్రిని కోరారు. ఆదివారం జిల్లాకు విచ్చేసిన ఆమెను అరసవల్లిలో కలిసి దళితసంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని గురుకులాలను మంత్రులు, ఎమ్మెల్యేలందరూ స్వయంగా సందర్శించాలని వారు కోరారు.