గూడూరులో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్

TPT: గూడూరు II టౌన్ పోలీస్ స్టేషన్‌లో రౌడీ-షీటర్లకు రెండవ పట్టణ సీఐ జే శ్రీనివాస్ కౌన్సెలింగ్ నిర్వహించారు. వారికి అనైతిక, అసంఘటిత కార్యకలాపాలలో పాల్గొనకూడదని కఠినంగా హెచ్చ రించారు. సమాజంలో శాంతి, భద్రతను కాపాడడంలో మంచి ఆచరణ చూపాలన్నారు. అలాగే రాబోయే వినాయక చవితి ఉత్సవాల సందర్భంలో, ప్రజా శాంతి మరియు చట్ట నిబంధనలను భంగం కలిగించకుండా ఉండాలన్నారు.